న్యూఢిల్లీ, డిసెంబర్ 3: జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఎంటర్‌ప్రైజెస్ అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ప్రతిపాదించిన లావా దేవీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ప్రతిపాదన వివరాలివి..జీఎంఆర్ ఇన్‌ఫ్రా జారీచేసే అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ ఆప్షనల్లీ కన్వర్ట్‌బుల్ డిబెంచర్లలో అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ పెట్టుబడి చేస్తుంది.
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో 9 శాతం వాటాను ప్రమోటర్ జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి జీఎంఆర్ ఇన్‌ఫ్రా కొనుగోలు చేస్తుంది. అటుతర్వాత జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఎంటర్‌ప్రైజెస్ వద్దనున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ వాటాల్ని అబుధాబి ట్రస్ట్ వద్ద తనఖా చేసి డిబెంచర్ల ద్వారా పెట్టుబడి మొత్తాన్ని పొందుతుంది.
ఈ లావాదేవీకి తాజాగా సీసీఐ అనుమతి లభించింది. అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి రూ.6,300 కోట్ల రుణం పొందుతున్నట్లు అక్టోబర్‌లోనే జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. గ్రూప్ ప్రమోటింగ్ సంస్థ జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ఈ నిధుల్ని వాడుతుంది.