calender_icon.png 29 December, 2024 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సీసీఏ ఆమోదం

26-12-2024 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 25: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎంఐసీ ఎలక్ట్రానిక్స్..జీపీఎస్ లోకేషన్ ఆధారిత పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఏసీ, నాన్ ఏసీ, ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల కోసం రూపొందించే ఎల్‌ఈడీ డెస్టినేషన్ బోర్డులకు కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ (సీసీఏ) ఆమోదం లభించిందని తెలిపింది. ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ ఈ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.27.46 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది క్యూ1లో నమోదైన రూ.10.71 కోట్లతో పోలిస్తే ఈ రెండో త్రైమాసికంలో ఆదాయం156 శాతం పెరిగింది. ఇబిటా క్యూ1లో రూ.2.81 కోట్లుకాగా, క్యూ2లో అది రూ. 2.87 కోట్లకు చేరింది. నికరలాభం ఇదేకాలంలో 8 శాతం వృద్ధితో రూ.1.97 కోట్ల నుంచి రూ. 2.13 కోట్లకు పెరిగింది.