27-02-2025 01:54:09 AM
మద్నూర్, ఫిబ్రవరి 26( విజయక్రాంతి), జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోచిగావ్ లో ఐదు లక్షల సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ నాయకులు ధార సాయిలు, మాజీ సొసైటీ చైర్మన్ కొండ గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామస్తులు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను కోరడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోజి గౌడ్ మాజీ సర్పంచ్ బసవంతప్ప బండి గోపి యాదవ్ మల్లు పటేల్ మైనార్టీ నాయకులు ఖలీల్ పాషా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుకారాం తదితరులు పాల్గొన్నారు.