calender_icon.png 7 February, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతతో సీసీ రోడ్డు పనులు చేపట్టాలి

07-02-2025 07:52:43 PM

జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహరెడ్డి..

ఎల్బీనగర్: అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి కోరారు. మన్సూరాబాద్ డివిజన్ బాగ్ హయత్ నగర్ పరిధిలోని పవనగిరి కాలనీ ఫేజ్-3 కాలనీలో దాదాపు రూ. 30లక్షలతో నిర్మిస్తున్న రాజరాజేశ్వరి పవనగిరి కాలనీ శివం హిల్స్ కాలనీలను అనుసంధానించే లింక్ రోడ్డు పనులను శుక్రవారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో నిరసనలు, ధర్నాలు చేసి అభివృద్ధి పనులకు నిధులు తీసుకువస్తున్నామని తెలిపారు. రోడ్లు పనులకు కాలనీ వాసులు సహకరించాలని కోరారు.  గుత్తేదారు  నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కొద్దిరోజుల్లోనే మిగిలిన రోడ్లు పూర్తి చేసి, కాలనీ పార్క్ లో బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానికులు తన్నీరు హరిప్రసాద్, హరినాథ్, నరసింహుడు, శ్రీనివాస్ రెడ్డి, యాస శ్యామ్ సుందర్ రెడ్డి, పీవీ రావు, ప్రభాకర్ రెడ్డి, బిజెపి నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్, పొట్లపల్లి సాయిరాం గౌడ్, తడిసిన శ్యామ్ సుందర్ రెడ్డి, జయతేజ, మోహన్ రెడ్డి, కడారి యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.