calender_icon.png 3 April, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులు నాణ్యతతో చేయాలి

27-03-2025 01:10:52 AM

నిజాంసాగర్, మార్చి 26 (విజయక్రాంతి )సీసీ రోడ్డు పనులను నాణ్యతతో చేయాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు లక్ష్మయ్య, మందా బలరాం, ప్రవీణ్ కృష్ణ, విట్టల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.