calender_icon.png 1 April, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతతో సీసీ రోడ్డు పనులు చేపట్టాలి

29-03-2025 08:25:50 PM

గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

ఎల్బీనగర్: గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా సీసీరోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, కాలనీ వాసులు రమేశ్, శ్యామ్, బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ దాసరి జయ ప్రకాశ్, నాయకులు సతీశ్, రఘునందన్ జోషి, టీంకు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.