calender_icon.png 11 March, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతతో సీసీ రోడ్డు పనులు చేపట్టాలి

10-03-2025 08:25:34 PM

బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి...

ఎల్బీనగర్: సీసీ రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని కార్పొరేటర్ లచ్చిరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో రూ. 27 లక్షలతో రోడ్లు పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీసీ రోడ్డు పనులను సోమవారం కార్పొరేటర్ లచ్చిరెడ్డి, జీహెచ్ఎంసీ డీఈ దామోదర్ రావుతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీలో వీధి దీపాలు, కరెంటు స్తంభాల సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు.

కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-1 అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ట్రెజరర్ రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, పుష్పాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బీజేపీ డివిజన్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం డివిజన్ కార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.