calender_icon.png 13 February, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

13-02-2025 01:44:05 AM

ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం పెద్ద రెడ్డి గ్రామంలో బుధవారం ఐదు లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట రామిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పనులను ప్రారంభించారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్జిఎస్ నిధుల నుంచి సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యాసిన్, మాజీ సర్పంచ్ నారా గౌడ్, మాజీ జెడ్పిటిసి సామెల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ మాజీ విండో చైర్మన్ బొండ్ల సాయిలు, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్, ఎల్లారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిరణ్, అశోక్ రెడ్డి, యాదయ్య, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.