20-03-2025 04:48:36 PM
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు...
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో గురువారం ఐదు లక్షల ఎన్ఆర్ఈజఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు యమా రాజయ్య మాట్లాడుతూ... వెల్లుట్ల గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ కి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలను తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా సిసి రోడ్డు నిర్మించాలని కోరిన ఎవరు పట్టించుకోలేదని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకువెళ్లగా మంజూరు చేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంట సాయిలు, కాంగ్రెస్ పార్టీ మండల ఓబీసీ అధ్యక్షుడు కమ్మరి భాస్కర్, గ్రామ ఉపాధ్యక్షుడు ఎండపల్లి రవి, యూత్ అధ్యక్షుడు సైగల స్వామి, వెల్లుట్ల సంతోష్ కుమార్, నర్వ శంకర్, యమా సాయిలు తదితరులు పాల్గొన్నారు.