calender_icon.png 26 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో పలు గ్రామాలలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

25-03-2025 07:35:03 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాలలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్మాణ పనులను ఆయన మంగళవారం నాడు పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, వర్షాకాలంలో వీధుల్లోని రోడ్లన్నీ బురద మాయంగా మారుతున్నాయని ఆయా గ్రామాల నాయకులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో కళ్యాణి గ్రామానికి 5 లక్షలు, అజమాబాద్ గ్రామానికి 5 లక్షలు, దావల్ మల్కాపల్లి గ్రామానికి 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈ నిధులతో నాణ్యమైన రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరితగతిన ఆయా గ్రామ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి కళ్యాణి గ్రామ అధ్యక్షులు సంజీవులు, మాజీ సర్పంచ్ మైదపు శ్రీనివాసులు, అజామాబాద్ అధ్యక్షులు పండరి, జీవన్, దాల్ మలకపల్లి గ్రామ అధ్యక్షులు రామచందర్, సాయిబాబా గౌడ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం గోపికృష్ణ, శ్రీనివాసులు, నగేష్, చందు, గణేష్, ప్రకాష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.