22-03-2025 06:44:39 PM
పెద్ద కొడఫ్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో శనివారం ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా మంజూరైన రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అభివృద్ధి పనుల సమాచారం ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకొని నాయకులను అధికారులను సమన్వయపరిచి పనులు వేగంగా కొనసాగే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వం గ్రామాలలో అభివృద్ధి చేయడం ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హైమద్, అనంతరావు, బేగరి రాములు, నబీ , హనుమ గౌడ్ , అంబయ్య, సాయిలు, నాందేవ్, జనార్దన్ గౌడ్,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు