calender_icon.png 22 March, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

21-03-2025 12:00:00 AM

మహబూబాబాద్. మార్చి 20: (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ని బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రె స్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగ సతీష్ గౌడ్ సిసి రోడ్డు పనులకు కొ బ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి గ్రామ అభివృ ద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే మురళి నాయక్ గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నార ని అన్నారు.

గ్రామంలోని ప్రజలకు రాజకీయాలకతీతంగా ఫలాలు అం దుతాయని ప్రతి పేదవాడి కళ కాం గ్రెస్ పార్టీతోనే నెరవేరుతాయని ఆ యన అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలను కాంగ్రెస్ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతం కోసం మరింతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ అఖి ల్, గ్రామ కార్యదర్శి రమేష్, నాయకులు బొల్లి సారయ్య, బాలు, దరా వత్ కీర్య, మాజీ వార్డు నంబర్ దరావత్ దేవేందర్, దరావత్ వీరన్న, భూపతి శ్రీను, మేరుగు మధు, దరావత్ రమేష్, డీ దేవేందర్, దొణికెల కుమారస్వామి, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.