calender_icon.png 19 March, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

18-03-2025 04:51:29 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలంలోని గ్రామపంచాయతీ మెయిన్ బజార్ చౌరస్తా నుండి శివాజీ నగర్ చౌరస్తా వరకు రూ 15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి ఈసా, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్ద బోయిన శంకర్, వార్డు సభ్యులు సింగరావు, ముష్కేసాగర్, తాండూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సింగారావు శ్రీధర్, నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మంతెన శివకృష్ణ, నాయకులు ముడిమడుగుల సురేష్, పెద్ద బోయిన రాజేశం, ఆగిడి సంతోష్, అప్పల సమ్మయ్య, కోరాళ్ల శంకర్, సప్ప హరీష్ లు పాల్గొన్నారు.