calender_icon.png 12 March, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

11-03-2025 10:22:15 PM

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ పంచాయతీ పరిధిలో సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈజిసీ నిధుల కింద 111 మీటర్ల సిసి రోడ్డు పనులకు ఐదు లక్షలు మంజూరయ్యాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాదవ్ విజయ్ (బాబు) పాటిల్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు, పాల్గొని ఎంఎల్ఏ తోట లక్ష్మీకాంత్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదేవిధంగా ఈ సందర్భంగా బాబూ పటేల్ మాట్లాడుతూ... ఇటు గ్రామస్తులు అటు ఎమ్మెల్యే  సాయంతో గ్రామ అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.