చేవెళ్ల, ఫిబ్రవరి 6: చేవెళ్ల మండలం ముడిమ్యాలలో రూ.15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను గురువారం పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య చొరవతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తు న్నామని,
అవసరం ఉన్న వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తా మని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్య క్షుడు పడాల రాములు, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, వివిధ పార్టీల నాయకులు వంగ శ్రీధర్ రెడ్డి, ఉరడి రాములు, రాజ్ కుమార్, మాధవరెడ్డి, బూర్ల సాయినాథ్, శివకుమార్, జంగారెడ్డి, వాజిద్, శ్రీశైలం, ఖాజా మోహినుద్దీన్, బ్యాగరి జనార్దన్, సత్యం, శంకర్ గౌడ్, అనీఫ్, రాంచదయ్య, యాదయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.