చేవెళ్ల: చేవెళ్ల మండల పరిధి మల్కాపూర్ గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. సీసీ రోడ్డు నిధుల మంజూరు చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి, మంజూరుకు కృషి చేసిన హైదరాబాద్ బీఎస్ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఆంజనేయులు గౌడ్, హైదరాబాద్ బీఎస్ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్య రెడ్డి, ఏఈ ప్రభాకర్, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు దేవుని శర్వలింగం, వెంకట్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు అత్తెల్లి అనంతరెడ్డి, యువ నాయకుడు డాక్టర్ వైభవ్ రెడి,్డ ఇంద్రసేనారెడ్డి, కృష్ణ గౌడ్, అడ్డెట్ల శీను, శంకరాచారి, హనుమంత్ ముదిరాజ్, మల్లేష్ గౌడ్, జైపాల్ గౌడ్, శివకుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ జాఫర్, యాదిరెడ్డి, గోపాల్ రెడ్డి, శివరాజ్, మాణిక్య రెడ్డి, నరేందర్ గౌడ్, కుమార్, మోసిన్, ఉమర్, రవి పాల్గొన్నారు.