24-03-2025 06:45:00 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు రూ.20 లక్షలు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబిర్ శ్యామ్ రావు, సంజీవులు, మెట్టు చంద్రం తదితరులు పాల్గొన్నారు.