calender_icon.png 13 March, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేనూరులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

13-03-2025 12:00:00 AM

మద్నూర్, మార్చి 12 ః కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు గ్రామంలో రూ 10 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాప్ సాయిలు ప్రారంభించారు. వెటర్నరీ ఆసుపత్రి నుంచి అంగన్వాడి భవనం వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నారు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సిసి రోడ్డు నిర్మాణానికి మం జూరు చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా సిసి రోడ్డు కోసం ప్రయత్నిస్తే ఎమ్మెల్యే స్పందించి సీసీ రోడ్డు మంజూరు చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు హనుమంతు యా దవ్, హనుమాన్లు స్వామి కిరణ్ హనుమంతు దేశాయ్ మోహన్ తుకారం మోహిన్ గోపి అమూల్ మేనూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.