28-04-2025 01:13:42 AM
చిన్నశంకరంపేట(మెదక్), ఏప్రిల్ 27; చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కోసం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తీగుళ్ల బిక్షపతి, మండల నాయకులు సురేందర్ నాయక్, ప్రభాకర్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మమ్మద్ అక్బర్, గ్రామ నాయకులు కుంట రాజశేఖర్, వాసుదేవ్, కర్రే శీను, కర్రే రాజు తదితరులుపాల్గొన్నారు.