calender_icon.png 2 February, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

01-02-2025 12:00:00 AM

చేవెళ్ల : చేవెళ్ల మండల పరిధి అంతారం గ్రామంలో ఎంపీ ల్యాడ్ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం చేవెళ్ల తహసీల్దార్, గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణయ్య, మాజీ సర్పంచ్ సులోచనాఅంజన్గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల క్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీసీ రోడ్డు నిధుల మంజూరుకు కృషి చేసిన హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని 2వ వార్డు ప్రజలు తెలిపారు. 

పంచాయతీ రాజ్ ఏఈ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, మాజీ ఉప సర్పంచ్ అనుసూయెల్లన్న, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షుడు తాళ్లపల్లి మణికంఠ, బీఆర్‌ఎస్ నాయకులు వీరాంజ నేయులు గౌడ్, పాండు, వీరస్వామి, రాము, కారోబార్ రాంచంద్రయ్య పాల్గొన్నారు.