calender_icon.png 29 March, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దానంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం

25-03-2025 01:05:12 AM

ఆందోల్, మార్చి 24 :ఆందోల్ మండలంలోని దానంపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను  ప్రారంభించారు.ఎన్‌ఆర్‌ఈజిఎస్ పథకం కింద రూ. 5లక్షల వ్య యంతో గ్రామంలోని  మెయిన్ రోడ్డు నుం చి హనుమాన్ మందిరం వరకు సీసీ రోడ్డు నిర్మించనున్నారు.

చాలాకాలంగా ఇక్కడ రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వర్యు లు దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో గ్రామం అభివృద్ధి చెందుతుందని మాజీ సర్పంచ్ ముప్పారం రాములు శంకర్ మౌనిక రెడ్డి, మాజీ ఉపసర్పంచ్  రాములు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు అరే ఆనందరావు, తులసి రామ్, యాదగిరి,శీను, కవళి దుర్గ య్య, నరసింహులు, రాములు, దుర్గయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.