కూకట్ పల్లి (విజయక్రాంతి): సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఉషా ముల్లపూడి రోడ్డులోని చేపడుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ఇరువైపులా చివరి అంచుల వద్ద మట్టిని వేసి చదును చేయాలన్నారు. ఏప్పటికప్పుడు సీసీ రోడ్డును క్యూరింగ్ చేసి వీలైనంత త్వరలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండా వాహనాల రాకపోకలకు సులభతరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసిఐ రాజీవ్ స్థానిక నాయకులు శివరాజ్ గౌడ్, షౌకత్ ఆలీమున్న రాజిరెడ్డి పోశెట్టి గౌడ్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.