04-04-2025 05:50:04 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో, రూ. 10 లక్షల రూపాయలతో, నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజుర సత్యం మాట్లాడుతూ... గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన గ్రామాల రోడ్లను తమ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పట్టించుకుని నిర్మాణానికి నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, గ్రామ అధ్యక్షులు గైని రాజేశ్వర్, నాయకులు పండుగ పెద్దలు, అశోక్, నబీఖాన్, రాజు, దొంగరి లక్ష్మణ్ ,కురుదుల లక్ష్మి, నారాయణ ,ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.