calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం

17-04-2025 01:03:42 AM

చేవెళ్ల , ఏప్రిల్ 16 : చేవెళ్ల మున్సిపల్ పరిధి ఊరెళ్ల వార్డులోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊరెళ్ల వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మాజీ సర్పంచ్ జహంగీర్, మాజీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.