10-04-2025 01:08:04 AM
చేవెళ్ల , ఏప్రిల్ 9 : బుధవారం చేవెళ్ల మండల పరిధి ఇబ్రహీంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే నిధులు రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలుపుతామన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్ డైరెక్టర్ ఫైండ్ల మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్కలపల్లి మల్లేష్ యాదవ్, మాజీ వార్డు సభ్యుడు రవీందర్ గౌడ్, స్థానిక నేతలు సుదర్శన్ రెడ్డి, స త్యనారాయణ రెడ్డి, ఫైండ్ల బాల్ రెడ్డి, ఎర్రవల్లి నర్సింహులు, మహమ్మద్ చాన్ పాషా, మహమూద్, రవీందర్ గౌడ్, జగన్ గౌడ్, నర్సింలు, దర్శన్ గౌడ్, బి.సత్యం, రమేష్, శ్రీను, వెంకటయ్య, బి.యాదయ్య, ఉస్మాన్, బషీర్, అజీమ్, సలీం, భిక్షపతి, పైండ్ల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.