calender_icon.png 18 March, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం..

17-03-2025 05:51:52 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని సాతెల్లి, శివపూర్, వెల్లుట్లపేట గ్రామాలలో కొనసాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొన్ని గ్రామాల్లోని వీధుల్లో సక్రమంగా సీసీ రోడ్లు లేకపోవడం వలన ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సాతెల్లి, శివపూర్ ఒక్కొక్క గ్రామానికి 5లక్షల రూపాయల చొప్పున ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు మంజూరు చేయించారని అన్నారు. ఈ నిధులతో నాణ్యత లోపం లేకుండా పనులు పూర్తిచేసి త్వరితగతిన స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సాతెల్లి గ్రామ అధ్యక్షులు నాగరాజు, శివపూర్ గ్రామ అధ్యక్షులు శంకర్, నర్సింలు, రాజు, ఆయా గ్రామాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.