calender_icon.png 15 January, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాలు త్రినేత్రాలు

11-07-2024 02:02:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): సీసీ కెమెరాలు శివుడి త్రినేత్రం లాంటివని పలువురు వక్తలు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్ గ్రామంలో డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 16 వైర్‌లెస్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని చెప్పారు. వైర్‌లెస్ సీసీ కెమెరాల వల్ల భారీ వాహనాలు, కోతులతో ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు.