calender_icon.png 8 April, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు మందిరాల్లో సీబీఎస్ఈ సెలబస్

07-04-2025 07:34:51 PM

భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన విద్యాపీఠం ప్రాంత సంఘటన మంత్రి...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిరాల్లో ఇకపై సీబీఎస్ఈ సెలబస్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో సీబీఎస్ఈ కోసం నూతన భవన నిర్మాణానికి శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. అటు శిశు మందిరాల ద్వారా విద్యార్థులకు సంస్కారంతో పాటు దేశభక్తిపై విలువలను తెలియజేస్తునే మారుతున్న కాలానుగుణంగా సీబీఎస్ఈ సెలబస్ ను ప్రారంభించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.