calender_icon.png 14 November, 2024 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి

12-11-2024 04:42:17 PM

రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6 న పాదయాత్ర...

టీఆర్ఎస్-డి రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్య నారాయణ...

ముషీరాబాద్ (విజయక్రాంతి): కేసీఆర్ అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని టీఆర్ఎస్-డి (తెలంగాణ రక్షణ సమితి-డెమోక్రటిక్) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్య నారాయణ డిమాండ్ చేశారు. గత పది ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు డిసెంబర్ 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ ప్రతినిధులతో కలిసి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసి వేలకోట్ల విధ్వంసానికి కారణమైన కేసీఆర్ అవినీతిపై రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ప్రజలకు తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, చత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందంలో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఫోన్ ట్యాంపరింగ్ జరిగినందు వల్లనే విదేశాలకు ప్రభాకర్ రావు పారిపోయారని అన్నారు. కేసీఆర్ కుటుంబం భూ బదలాయింపులలో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను నట్టేట ముంచారని, మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను లోటు బడ్జెట్ గా మార్చారని విమర్శించారు. ఆదివాసులపై ఉక్కుపాదం మోపి, ఫారెస్ట్ అధికారులలో కలిసి వారి పంటలను విధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మహిళ నేతలు మంజూషా, శారదా, సురేఖ, లక్ష్మి, లావణ్య, శ్రీలత పాల్గొన్నారు.