calender_icon.png 1 April, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు

27-03-2025 01:20:08 AM

  1. మహదేవ్ బెట్టింగ్ కేసు.. 
  2. దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో కూడా.. 
  3. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎంకు చెందిన 14 ప్రాంతాల్లో ఈడీ దాడులు

రాయ్‌పూర్, మార్చి 26: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారిస్తున్న సీబీఐ బుధవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 60 ప్రాం తాల్లో సోదాలు చేసింది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భూపేశ్ బఘేల్ నివాసాలోన్ల సోదాలు జరిపారు. ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ అధికారులు తనిఖీ లు చేపట్టగా.. తాజాగా బెట్టింగ్ యాప్ కేసు లో సీబీఐ తనిఖీలు చేసింది.

కేవలం భూపేశ్ ఇంట్లోనే కాకుండా ఆయనతో సన్నిహితంగా ఉండే ఓ పోలీసు అధికారి ఇంట్లోనూ సీబీఐ సోదాలు చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్ సమావేశానికి బఘేల్ వెళ్లాల్సి ఉండగా.. సీబీఐ అధికారులు రాయ్‌పూర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సోదాలు చేసేందుకు వచ్చారు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో నమోదైన కేసులను విచారించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సీబీఐకి అనుమతినిచ్చింది. 

మరిన్ని ప్రాంతాల్లో కూడా.. 

ఈ వ్యవహారంపై కేవలం భూపేశ్  నివాసాల్లోనే కాకుండా భోపాల్, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు,  పోలీస్ ఆఫీసర్ల ఇండ్లలో కూడా సీబీఐ సో దా లు చేసింది. పోకర్, క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, భారత్‌లో ఎన్నికలపై బెట్టింగ్ నిర్వహించే మహదేవ్ యాప్ కేంద్రం 2023లోనే బ్లాక్ చేసింది.

2024లో ఛత్తీస్‌గఢ్ పోలీసులు భూ పేశ్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్ప ట్లో సీఎంగా ఉన్న భూపేశ్ తనకు సహకరించాడని మహదేవ్ యాప్ యజమాని శుభమ్ సోనీ ఆరోపణలు గుప్పించాడు. ఈ యాప్ చలామణిలో ఉన్నపుడు నెలకు రూ.450 కోట్లను చట్టవిరుద్ధంగా సేకరించింది. 

ఇప్పుడిక సీబీఐ వచ్చింది 

సీబీఐ సోదాలపై భూపేశ్ బఘేల్ కార్యాలయం స్పందించింది.  ‘ఇప్పుడు సీబీఐ వచ్చింది. మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఏఐసీసీ మీటింగ్ కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన సమయంలో సీబీ ఐ అధికారులు వచ్చారు.’ అన్నారు. భూపేశ్ బ ఘేల్ తనయుడి నివాసం లో ఈ డీ దాడులు చేసిన కొద్ది రో జుల వ్యవధిలోనే ఈ సోదాలు జరిగాయి.

బీజేపీ భయపడింది

ఈ దాడులపై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి సుశీ ల్ ఆనంద్ శుక్లా స్పందించారు. ‘ఎప్పుడైతే భూపేశ్ బఘేల్‌ను పంజాబ్ కాం గ్రెస్ ఇంచార్జిగా నియమించారో బీజేపీ భయపడింది. మొదట ఈడీని, ఇప్పుడు సీబీఐని పంపింది. బీజేపీ భయపడిందని ఈ దాడు లు చూపుతున్నాయి. బీజేపీ రాజకీయంగా పోరాడటంలో ఫెయిలైం ది. అందుకే రాజకీయ ప్రత్యర్థుల మీదకి కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపుతోంది. బఘేల్ లేదా కాంగ్రె స్ భయపడటం లేదు’  అన్నారు.