కోల్ కతా: కోల్ కతా హత్యాచార ఘటనపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దేశ వ్యప్తంగా సంచలనం చెలరేగిన కోల్ కతా హత్యాచార ఘటనపై మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిద్ర పోవట్లేదని, నిజాన్ని వెలికితీసేందుకు వారికి కొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాగే బాధితురాలి ఫోటో, పేరును వికీపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. కాగా, వైద్య శాఖల్లో ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణలపై ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తు పురోగతి, విచారణ ఏ దశలో ఉందో తెలిపే స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు కోరింది.