అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు మంగవారం అనుమతిచ్చింది. నెల 16 నుంచి జూన్ 1 వరకు సీఎం జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ అనుమతి కోరారు. యూకే, స్వీట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వవాలని పిటిషన్ దాఖాలు చేశారు. ఆయన యూరప్ పర్యటనకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఫోన్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని కోర్టు సిఎం జగన్ కు ఆదేశించింది.