calender_icon.png 16 January, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీపై సీబీఐ పంజా

09-08-2024 12:57:43 AM

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను అరెస్టు చేసిన సీబీఐ

లంచం కేసులో పట్టుబడ్డ సందీప్ యాదవ్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: లంచం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ యాదవ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ముంబైకి చెందిన నగల వ్యాపారి వద్ద రూ.20 లక్షల లంచం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నగల వ్యాపారికి చెందిన ప్రాంతాల్లో ఆగస్టు 3, 4 తేదీల్లో ఈడీ సోదాలు చేసింది. అయితే, రూ.25 లక్షలు ఇవ్వకపోతే కొడుకును అరెస్ట్ చేస్తానని నగల వ్యాపారిని సందీప్ బెదిరించాడు. బేరసారాల తర్వాత ఆ మొత్తం రూ.20 లక్షలకు తగ్గిందని సీబీఐ తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధికారి అయిన సందీప్‌యాదవ్‌ను లంచం తీసుకుంటుండగా సీబీఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.