న్యూఢిల్లీ, ఆగస్టు 1: సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి చార్జ్‌షీట్‌ను గురువారం దాఖలుచేసింది. ఇందులో 13 మందిని నిందితులుగా పేర్కొన్నది. వారిలో నలుగురు విద్యార్థులు, ఒక ఇంజినీర్ కూడా ఉన్నారు. పలువురు నీట్ విద్యార్థుల కుటుంబీకుల పేర్లు కూడా ఇందులో ఉన్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. పేపర్ లీక్‌లో నితీశ్‌కుమార్, అమిత్ ఆనంద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలిపింది. ఆయుష్‌కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్‌కుమార్, శివ్‌నందన్‌కుమార్, సికేంద ర్ యద్‌వేందు పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చింది.