calender_icon.png 5 January, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు

04-01-2025 01:06:22 AM

రాజేంద్రనగర్, జనవరి 3: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఇదరు కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్లపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఓ ప్రయాణికుడి నుంచి వీరిద్దరు రూ.50వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యం  నిందితులు వినయ్‌కుమార్, ముఖేష్‌కుమార్‌గా గుర్తించిన సీబీఐ అధికారులు శుక్రవారం వారి ఇళ్లతోపాటు ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు.

రూ.4.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీరిద్దరికి సాయంచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కెనరా బ్యాంకు అధికారి సంతోష్‌కుమార్‌పైనా సీబీఐ అధికారులు కేసు పెట్టారు. గతేడాది అక్టో  5న జెడ్డా నుంచి ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. వారి నుం  కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో సదరు అధికారులు రూ.50 వేలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.