calender_icon.png 25 October, 2024 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థ్రిల్లింగ్‌కు గురిచేసింది!

06-07-2024 02:55:33 AM

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న సినిమా ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైథలాజికల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ఇద్దరు హీరోల క్యారెక్టర్లను పరిచ యం చేస్తూ గతంలో గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటంతో తాజాగా శుక్రవారం మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను రివీల్ చేశారు. దీంట్లో రష్మిక అవతార్ థ్రిల్లింగ్‌గా ఉంది. గ్లింప్స్ వీడియోలో డబ్బును తవ్వి తీస్తున్నట్టున్న రష్మిక క్యారెక్టర్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచారు. దేవిశ్రీ సంగీతం కట్టిపడేసింది. జిమ్ సర్బ్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారీ చిత్రంలో. తెలుగు, తమిళం, హిందీ భాష ల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్‌లో జరుగుతోంది.