కోనరావుపేట, జనవరి 31: పశువుల నీటి తొట్టిలో చెత్త, నాసు, పిచ్చి మొక్కలు చేరడంతో పశువులు నీళ్లు తాగేందుకు ఇబ్బంది పడుతున్నాయి. కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామ శివారులో గల పశువుల నీటి తొట్టిలో నాసు పిచ్చి మొక్కలు చెత్తతో పూర్తిగా నీటి తొట్టిలోని నీరంతా కలుషితమయ్యాయి.
గత కొన్ని నీళ్లు గా ఆ నీటితోట్టిని శుభ్రం చేయకపోవడంతోనే నాసు,పిచ్చి మొక్కలు తయారై పశువులు తాగలేని పరిస్థితి చేరుకుంది. ఆ నీళ్లు తాగితే పశువులు రోగాల బారిన పడతాయని, వెంటనే అధికారులు స్పందించి ఆ నీటితోట్టిలోని చెత్త, పిచ్చి మొక్కలను తొలగించాలని రైతులు కోరుతున్నారు.