calender_icon.png 26 April, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జింకలగూడెం కేంద్రంగా జోరుగా పశువుల అక్రమ రవాణా

25-04-2025 01:44:19 AM

ప్రతీరోజు భారీ వాహనాల్లో కబేళాలకు తరలింపు

అడ్డుకున్న బీజేపీ మండల అధ్యక్షులు,కార్యకర్త

దాడికి పాల్పడ్డ పశువుల వ్యాపారులు 

బూర్గంపాడు,ఏప్రిల్ 24(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని జింకలగూడెం గ్రామం పశువుల అక్రమ రవాణాకు అడ్డగా మారింది.ఈ అక్రమ దందా గురించి పట్టించునేవారు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా పగలు,రాత్రి అనే తేడా లేకుండా పశువుల రవాణా కొనసాగుతోంది. ప్రతీరోజు ఛత్తీస్గఢ్ నుంచి పశువుల ను సేకరించి డీసీఎంలు, కంటైనైర్లు, ట్రాలీ ఆటోల్లో కుక్కి వాటిని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని కబేళాలకు తరలి స్తున్నారు.ఈ క్రమంలో వాటిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు.

పశువుల కాళ్లు, శరీర భాగాలు విడిపోయి మూగజీవాలు అల్లాడి పోతున్నాయి. పశువులను చంపి అనేకమంది వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు.ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో కొంద రు ఏకంగా ఇళ్లు,స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు పశువు ల అక్రమ వ్యాపారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.ఈ అక్రమ రవాణా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చూడడానికి కూడా పశువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీరోజు భారీ వాహనాల్లో

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పశుసంపద అధికంగా ఉంది.ఈ విషయం తెలుసుకున్న కొంతమం ది పశువులు అక్రమ వ్యాపారంపై కన్నేశారు. స్థానికంగా ఉండే వారిని ఏర్పాటు చేసుకుని జిల్లాలోని అశ్వాపురం,చర్ల,  ఛత్తీస్గఢ్ గ్రామా ల్లో ఉన్న పశువులను కొనుగోలు చేస్తున్నారు.అనంతరం వాటిని వందల కిలోమీట ర్లు నడిపించి గోదావరి పరివాహక ప్రాంతాలకు తీసుకొచ్చి ఆవులు, ఎడ్లు, గేదెలను ప్రత్యేకంగా కంటైన్లు, డీసీఎం వాహనాల్లో ఎక్కిస్తున్నారు.సుమారు 6 పశువులు పట్టే వాహనంలో 20 నుంచి 30 పశువులను కుక్కుతున్నారు. పశువులు ఎక్కలేక పోతేవాటిని చిత్రహింసలు పెట్టి వేధిస్తున్నారు. కనీ సం వాటికి ఆహరం కూడా అందించడం లేదు. అనంతరం వాటిని హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. ఒకవేళ మార్గం మధ్యంలో పశువులు చనిపోతే వాటిని అక్కడే పడేస్తున్నారు.ఇలా గత కొంత కాలంగా మండలం లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో రాత్రి వేళల్లోనే సాగే ఈ అక్రమ పశువుల వ్యాపారం నేడు పగలు కూడా నడుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాల్లో పట్టపగలే ఎక్కించి తరలిస్తున్నారు. 

పలుమార్లు పట్టుబడిన ఆగని దందా

పశువులను కబేళాలకు తరలించడం చట్టరిత్యా నేరం. అయినా కూడా బూర్గంపాడు మండలంలోని వ్యాపారులు పశువుల అక్ర మ వ్యాపారం చేస్తూ పలుమార్లు పట్టుబడిన యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. స్థానిక యువకులు ఎవరైనా వాహనాలను ఆపితే ముం దుగా వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు.

పశువుల రవాణాను అడ్డుకున్న బిజెపి నాయకుడు

బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామం నుంచి బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా సుమారు 100 పశువులను కంటైనర్ వాహనంలో తరలించడానికి సిద్ధమయ్యారు.అట్టి విషయం తెలుసుకొని బూర్గంపాడు బిజెపి మండల అధ్యక్షులు బీరకాయ సాయి శ్రీను,మరో బిజెపి కార్యకర్త గునపాటి వెంకటరెడ్డి అక్కడ చేరుకొని పశువులను తరలింపును అడ్డుకున్నారు.దీంతో ఆగ్రహానికి గురైనా అదే గ్రామానికి చెందిన పశువుల వ్యాపారులు, వారి బంధువులు సాయిశ్రీను,వెంకట్ రెడ్డి లపై దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో సాయి శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందించడంతో హుటా హుటిన చేరుకొని అక్కడ పరిస్థితిని సర్దుమనిగించారు.సాయి శీను తల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ ఎస్ కె.లక్ము, ఎస్ కె.ఇస్మాయిల్ ,ఎస్ కె. నాగుల్ మీరా,ఎస్ కె చాంద్ బీ ,ఎస్ కె. హుస్సేన్, నాగుల్ మీరా (కాలా ),ఎం.డి మోహిస్ లపై కేసు నమోదు చేసినట్లు బూర్గంపాడు ఎస్త్స్ర రాజేష్ తెలిపారు.

దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..

జింకలగూడెం గ్రామంలో అక్రమంగా గోవులను తరలించే వాహనాన్ని అడ్డుకోబోయిన బిజెపి మండల అధ్యక్షుడు సాయి శ్రీను, మరో కార్యకర్తపై జింకలగూడెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యాపారులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.  మండలంలో విచ్చలవిడిగా గోవుల వ్యాపారం నిర్వహిస్తుంటే ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పై విచక్షణారహితంగా కొట్టి గాయప రచడం సమంజసం కాదన్నారు .

- బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి