calender_icon.png 18 January, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి

26-08-2024 02:57:59 PM

సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. తక్కల్లపల్లి రైల్వే గేట్ వద్ద ఛత్తీస్ ఘడ్ నుంచి వస్తున్న ఐషర్ వ్యాన్ TN73AJ0178లో 27 పశువులను తరలిస్తున్నారనే సమాచారంతో స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలు, గోరక్షకులు, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి సోమవారం. అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా 10 పశువులు మరణించదాంతో వాటిని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ... గోవుల అక్రమ రవాణా జిల్లా మీదుగా విచ్చలవిడిగా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వెంటనే పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అరుణ్ లోయ, గోళం తిరుపతి, కొలిపాక కిరణ్, రేవల్లి రాజలింగం, ఘన్ శ్యామ్, వేణుగోపాల్, స్వామి, సతీష్, పూదరి హరీష్, మహేందర్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.