calender_icon.png 5 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపైనే పశువులు.. నివారణ చర్యలు శూన్యం

05-03-2025 01:00:44 AM

హుజూర్ నగర్, మార్చి 4: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని ఇందిరా సెంటర్ నుండి పోలీస్ స్టేషన్,కూరగాయల మార్కెట్ వరకు సమీప ప్రాంతాల్లో మెయిన్ రోడ్డుపై ఉదయం,రాత్రి సమయాల్లో అడ్డంగా పశువులు సంచరిస్తూ,రోడ్ పై అడ్డంగా పడుకో వడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతు న్నారు.

రద్దీ ప్రాంతాల్లో వాహనాల మధ్య నుంచి వెళ్లడంతో ప్రయాణికులు ప్రమాదాలకు బారినపడుతూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పశువులను రోడ్డుపై సంచరించకుండా నివారణ చర్యలు చేపట్టాలని వాహన చోదకులు,పట్టణ ప్రజలు కోరుతున్నారు.