మంథని: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పోతారం గ్రామం నుండి హైదరాబాద్ కు పశువులను కాళేబారాలకు తరలిస్తున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి పశువుల దందా మూడు పువ్వులు ఆరు కాయాలుగా సాగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువుల తరలింపుపై నిషేధం విధించిన ఈ పోతారం గ్రామం నుండి పశువుల రవాణ సాగుతోంది అంటే ఈ దందా చేసే వారికి కొంతమంది ప్రజా ప్రతినిధుల, అధికారుల అండదండలు ఉన్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో నుంచి ఒక ట్రాలీ లో పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పశువులను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి పశువులను గోదావరిఖనిలో ఉన్న గోశాలకు తరలించామన్నట్లు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు.