calender_icon.png 16 October, 2024 | 4:56 PM

గోవధ మహాపాపం

16-10-2024 01:59:14 AM

గోహత్యల నివారణకు కొత్త చట్టాలు రావాలి

జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి

పనాజీ, అక్టోబర్ 15: గోవు తల్లితో సమానమని, అలాంటి గోవును వధించడం మహాపాపమని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. గోహత్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని స్వామీజీ డిమాండ్ చేశారు.

‘గోధ్వజ స్థాపన భారత్ యాత్ర’లో భాగంగా మంగళవారం స్వామీజీ  గోవాలోని డబోలియం విమనాశ్రయానికి చేరుకున్నారు. స్వామీజీకి వాస్గొడిగామ ఎమ్మెల్యే కృష్ణ సల్కార్, పద్మశ్రీ సద్గురు బ్రహ్మేశనంద్ ఆచార్య స్వాగతం పలికారు. అనంతరం దత్త పద్మనాభ పీఠ్ క్షేత్ర తపో భూమిలో స్వామీజీ శిష్యగణంతో కలసి గోధ్వజ స్థాపన చేశారు.

అనంతరం స్వామీజీ అనుగ్రహ ప్రవచనమిస్తూ.. గోహత్యలకు మద్దతు ఇచ్చే నేతలకు ఎవరూ మద్దతు ఇవ్వొద్దని, గోమాతను రాష్ట్రమాతగా అంగీకరించని రాజకీయ పార్టీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. నేతలు ఓట్లడిగేందుకు వచ్చినప్పుడు గోవును సంరక్షణకు కట్టుబడి ఉంటామనే హామీని వారి నుంచి తీసుకోవాలని సూచించారు.

గోధ్వజ స్థాపన భారత్ యాత్రలో భాగంగా బుధవారం స్వామీజీ మహారాష్ట్రకు చేరుకోనున్నారు. ముంబైలోని సీసీ ట్యాంక్ రోడ్ శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయంలో మాధవ్ భాగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోధ్వజ స్థాపన చేయనున్నారు. అనంతరం అనుగ్రహ ప్రవచనమివ్వనున్నారు.