29-01-2025 01:53:29 AM
గాంధీనగర్, జనవరి 28: కాంగో ఫీవర్‌తో బాధపడుతూ గుజరాత్‌లోని జామ్‌న గర్‌కు చెందిన మోహన్‌భాయ్(51) మృతి చెందాడు. పశువుల కాపరిగా పని చేస్తున్న మోహన్ ఈ నెల 21న ఆనారోగ్యంతో బాధపతుడూ ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమం లో చికిత్స పొందుతూ అతడు సోమవారం మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.
అతడి రక్త నమూనాలను పుణెలోని ల్యాబ్ కు పంపించగా క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్(కాంగో ఫీవర్)గా తేలిందని పేర్కొ న్నారు. జామ్‌నగర్‌లో గత ఐదేళ్లలో ఇటువంటి కేసు నమోదు కావడం ఇదే తొలి సారని వైద్యులు తెలిపారు.
దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమై మోహన్ ఇంటి సమీ పంలో నిఘాను పెంచింది. అంతేకాకుండా మరిన్ని కేసులు నమోదుకాకుండా ఉండేందుకు పరిశుభ్రతను పాటించాల్సిందిగా అత డి కుటుంబ సభ్యులకు సూచించింది.