19-04-2025 06:25:53 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో శనివారం 336 పశువులకు వైద్యాధికారులు గాలికుంటు వ్యాధి టీకాలు అందించారు. ఈ సందర్బంగా పశు వైద్యాధికారి రమేష్ మాట్లాడుతూ.. రైతులు ఖచ్చితంగా తమ పశువులకు టీకాలు ఇప్పించుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా 103 ఆవులకు, 233 గేదెలకు టీకాలు అందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పోచయ్య, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.