calender_icon.png 26 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెనోవా సెంచురీ ఆస్పత్రిలో క్యాత్‌ల్యాబ్ ప్రారంభం

26-02-2025 01:50:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుండె సంబంధిత వైద్య చికిత్సలందిస్తున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 12లో గల రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్‌లో ‘ఆర్టిస్ జీ ఫ్లోర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ క్యాత్ ల్యాబ్’ అందుబాటులోకి వచ్చింది. హాస్పటల్‌లోని ఓ పేషంట్‌తో కలిసి ఆస్పత్రి వైద్య బృందం మంగళవారం ప్రారంభించింది.

రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైైర్మన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి.కె.ఎస్. శాస్త్రి మాట్లాడుతూ.. ఆపరేషన్లలో త్రీడీ ఇమేజింగ్ చాలా అవసరమన్నారు. నూతన సాంకేతికతలు ఆరోగ్య సంరక్షణ విధానాల్లో ఎప్పటికప్పుడు మార్పులు తెస్తున్నాయని చెప్పారు. ఆర్టిస్ జీ ఫ్లోర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ క్యాత్ ల్యాబ్ ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు భద్రత ఇస్తుందన్నారు.

కార్యక్రమంలో డాక్టర్ నిర్మల్‌కుమార్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్, క్లినికల్ కార్డియాలజీ, డాక్టర్ కె.వి. రాజశేఖరరావు, డైరెక్టర్ కార్డియోథొరాసిక్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, డాక్టర్ సయ్యద్ అక్రమ్ అలీ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఇంటెన్సివ్ కరోనరీ కేర్, డాక్టర్ నరేష్ కుమార్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ క్యాథ్ ల్యాబ్, డాక్టర్ అంజని కిరణ్మయి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ మల్లంపాటి సమీర్, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, డాక్టర్ ఉషారాణి పాల్గొన్నారు.