calender_icon.png 26 April, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్రీయ ఆధారాలతో నేరస్తుల పట్టివేత

26-04-2025 12:00:00 AM

250 గ్రాముల బంగారం స్వాధీనం.. ఇద్దరు నేరస్తులు జైలుకు తరలింపు

పాల్వంచ ,ఏప్రిల్25 (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలో ఈ ఏడాది జనవరి 25న  నవభారత్ ఎంప్లాయిస్ క్వార్టర్స్ జరిగిన దొంగతనాన్ని చాలెంజిగా తీసుకున్న జిల్లా పోలీసులు. నేర స్థలంలో లభించిన శాస్త్రీయ ఆధారాలు ఆధారంగా కేసును చేదించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నిందితుల కోసం కొత్తగూడెం సిసిఎస్ పాల్వంచ టౌన్ పోలీసులు సంయుక్తంగా టీములుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

శుక్రవారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు. గతంలో అరెస్టు చేసిన అనిల్ సింగూర్ బెయిల్ కోసం కొత్తగూడెం కోర్టుకు వచ్చారన్న నమ్మదగిన సమాచారం మేరకు పాల్వంచ పోలీసులు దొంగతనం కేసులో నిందితుడైన పింటు భవారే, మరో వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని  అదుపులోకి తీసుకొని విచారించగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పింటూ భవారే బెల్ గ్యాంగ్ గా  గుర్తించారు.

దొంగతనానికి పాల్పడిన వ్యక్తి గతంలో మధ్యప్రదేశ్లో చాలా దొంగతనాలు చేశారని. పాల్వంచ నవభారత్ ఎంప్లాయిస్ క్వార్టర్స్ లో దొంగతనం చేసినట్లుగా విచారణలో అంగీకరించారు. ఎంప్లాయిస్ క్వార్టర్ లో  బంగారాన్ని దొంగతనం కి పాల్పడిన పింటూ తో పాటు మరో వ్యక్తి అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రం తండా  గ్రామానికి చెందిన శోభన్ సింగ్ ,సోలంకి అమ్మినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో సీఐ సతీష్, టౌన్ ఎస్‌ఐ సుమన్, సిసిఎస్ ఎస్త్స్ర ప్రవీణ్, అదనపు ఎస్‌ఐ రాఘవయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ జీవన్ రాజు, కానిస్టేబుల్ లక్ష్మణ్, కృష్ణ, రమేష్,పాల్గొన్నారు.