calender_icon.png 23 October, 2024 | 6:58 AM

ఆరడుగుల నాగుపాము పట్టివేత

04-08-2024 03:45:06 AM

ఇండియన్ స్పెటికల్ కోబ్రాగా గుర్తింపు

వనపర్తి, ఆగస్టు 3 (విజయక్రాం తి): వనపర్తి పట్టణంలో శనివారం ఆరడుగుల పొడవున్న ఇండియన్ స్పెటికల్ కోబ్రాను పట్టుకున్నారు. పట్టణంలోని రాంబాబు అనే వ్యక్తి ఇంట్లోకి అతిపెద్దదైన పాము కన్పించడంతో స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్‌కు ఫోన్ ద్వారా తెలిపాడు. తన బృందంతో కలిసి వెళ్లిన కృష్ణసాగర్ దాదాపు గంటపాటు శ్రమించి పామును పట్టుకున్నారు. ఇండియన్ స్పెటికల్ కోబ్రాగా గుర్తించారు. దాని వయసు దాదాపు 15ఏళ్లకు పైగా ఉంటుందన్నారు. నాగుపాములు సాధారణం గా 5అడుగులు మాత్రమే ఉంటాయని, ఇదిమాత్రం ఆరు అడుగులకు పైగా పొడవున్నదని స్నేక్ సొసైటీ అధ్యక్షుడు తెలిపారు. గత 12 సంవత్సరాల్లో ఇంతటి భారీ నాగుపాము ను చూడలేదన్నారు. ఆ నాగుపామును వనపర్తి జిల్లా అటవీప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు తెలిపారు.