calender_icon.png 10 January, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ పట్టేయాలని!

13-07-2024 12:36:37 AM

హరారే:  రెండు విజయాలతో జోరు మీదున్న యంగ్‌ఇండియా టీ20 సిరీస్‌పై కన్నేసింది. హరారే వేదికగా గిల్ సేన నేడు జింబాబ్వేతో నాలుగో టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌లో 2 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది.

మరోవైపు జింబాబ్వే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. టీమిండియాకు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా సమస్యలు లేవు. ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. అభిషేక్ శర్మ, రుతురాజ్, సంజూ శాంసన్, దూబేలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఫినిషర్లుగా అదరగొట్టేందుకు రింకూ సింగ్, సుందర్‌లు సిద్ధంగా ఉన్నారు.