calender_icon.png 17 November, 2024 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్

03-09-2024 01:21:45 AM

  1. కేరళ కాంగ్రెస్ లీడర్  సిమీ రోస్‌బెల్  సంచలన వ్యాఖ్యలు 
  2. నేతలతో సన్నిహితంగా మెలిగితేనే పదవులని ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కేరళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ప్రకంపనలు సృష్టిస్తోంటే.. తాజాగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సిమీ రోస్‌బెల్ చేసిన ఆరోపణలు దేశరాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఎర్నాకుళానికి చెందని రోస్‌బెల్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తోందని ఆరోపణలు చేశారు. పార్టీలో కొందరు మహిళలు లైంగిక దోపిడీకి గురువుతున్నారని, బడా నేతలతో సన్నిహితంగా మెలిగితేనే ఉన్నత పదవులు ఇస్తారని.. ఎదురు తిరిగితే అథఃపాతాలానికి తొక్కేస్తారని చెప్పారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా పలువురిపై ఆమె ఆరోపణలు చేశారు. రోస్‌బెల్ ఆరోపణలను కేరళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆమెను ఏఐసీసీ, పీఎస్సీ సభ్యత్వం నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు కేరళ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు ఒక ప్రకటనలో తెలిపారు.