calender_icon.png 8 February, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణలో 57 కులాల గొంతు కోశారు

08-02-2025 01:42:41 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 7: ఎస్సీ వర్గీకరణలో 57 ఎంబీఎస్‌సీ కులాల గొంతు   మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కావాలంటున్న మందకృష్ణ మాదిగది అత్యాశ అని ఎంబీఎస్‌సీ కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బైరీ వెంకటేశం ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తమ కులాలకు ప్రభుత్వం ‘ఎ’ గ్రూప్‌లో కలపకపోవడంతో తీవ్ర అన్యాయమన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం తక్షణమే 57 ఎంబీఎస్‌సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.